నేడు తగ్గిన వెండి ధర – బంగారం రేట్లు ఇవే

Today Gold rates

0
102
Gold
వారం రోజులుగా బంగారం ధర పరుగులు పెడుతోంది. ఓ పక్క షేర్ మార్కెట్లో పెట్టుబడులు తగ్గాయి దీంతో ఇన్వెస్టర్లు అందరూ బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. ఇలాంటి వేళ బంగారం ధర 8 శాతం పెరిగింది గత వారం రోజుల్లో , అయితే నేడు మార్కెట్లో పుత్తడి వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది ఓసారి చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర స్థిరంగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,300 దగ్గర ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,100 దగ్గర ట్రేడ్ అవుతోంది.
బంగారం ధర స్థిరంగా ఉంటే.. వెండి రేటు మాత్రం నేడు తగ్గింది, మరి వెండి నిన్న భారీగా పెరుగుదల నమోదు చేసి నేడు నేలచూపులు చూసింది.. కిలోకి రూ.200 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.76,600కు ట్రేడ్ అవుతోంది. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు అనలిస్టులు.