భారీగా తగ్గిన బంగారం ధర ఈరోజు రేట్లు ఇవే

భారీగా తగ్గిన బంగారం ధర ఈరోజు రేట్లు ఇవే

0
106

పసిడి ప్రేమికులకి గుడ్ న్యూస్ నిజమే ఈ రోజు కూడా బంగారం ధర తగ్గింది.. అయితే వెండి ధర కూడా ఇలాగే తగ్గుతూ ఉంది మార్కెట్లో,దాదాపు ఇలా పదిహేను రోజులుగా బంగారం ధర తగ్గుతూనే ఉంది..
మరి నేడు మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.80 పడిపోయింది. దీంతో ధర రూ.53,350కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.80 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.48,900కు పడిపోయింది.

పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.80 దిగొచ్చింది. దీంతో ధర రూ.67,900కు పడిపోయింది. ఇక వెండి బంగారం ధరలు మార్కెట్లో ఇలాగే కొనసాగుతున్నాయి, మరికొన్ని రోజులు బంగారం వెండి ధరల్లో ఈ మార్పు ఉంటుంది అంటున్నారు అనలిస్టులు.