పరుగులు పెడుతున్న బంగారం ,వెండి ధరలు – ఈ రోజు రేట్లు ఇవే

Today gold rates

0
168
Gold

 

బంగారం ధర పరుగులు పెడుతోంది. గడిచిన వారం రోజులుగా బంగారం ధర పెరుగుదల చూపిస్తోంది కానీ ఎక్కడా తగ్గడం లేదు. బంగారం ధర ఇలా భారీగా పెరగడానికి అంతర్జాతీయ పరిస్దితులు కూడా ప్రధాన కారణం అనే చెబుతున్నారు. ముఖ్యంగా షేర్ల ర్యాలీ కొనసాగడం లేదు అన్నీ సూచీలు డౌన్ లో ఉన్నాయి.. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు బంగారం పై పెట్టుబడి పెడుతున్నారు.

హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర పెరిగింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 పెరిగింది. దీంతో రేటు రూ.50,300కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ.46,100కు ట్రేడ్ అవుతోంది.

ఇక బంగారం ధర ఇలా ఉంటే వెండి రేటు మాత్రం పరుగులు పెడుతోంది. వెండి ధర నిన్నటి కంటే ఈ రోజు కిలోకి 700 ధర పెరిగింది, దీంతో కిలో వెండి ధర 77500 కి ట్రేడ్ అవుతోంది. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరుగుతాయి అంటున్నారు నిపుణులు.