ఏప్రిల్ నెలలో బంగారం ధర ఒక్కసారిగా పెరుగుతూ హయ్యెస్ట్ మార్క్ కు చేరుతోంది… బంగారం వెండి రెండు ధరలు అమాంతం పెరుగుతున్నాయి… అయితే గడిచిన రెండు రోజులుగా తగ్గిన బంగారం మళ్లీ కాస్త పెరిగింది… అయితే నేడు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి ఓసారి చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర నిలకడగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పెరగలేదు తగ్గలేదు. నిన్నటి రేటుకి ట్రేడ్ అవుతోంది..10 గ్రాముల బంగారం ధర రూ.48,650 దగ్గర కొనసాగుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,590 దగ్గర ట్రేడ్ అవుతోంది.
బంగారం ఇలా ఉంటే వెండి ధర కూడా చూడవచ్చు, వెండి మాత్రం కాస్త తగ్గుదల నమోదు చేసింది.. కిలో వెండి దాదాపు 200 మేర తగ్గింది.. దీంతో రేటు రూ.73,800కు ట్రేడ్ అవుతోంది.. బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.