భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు : రేట్లు ఇవే

0
43
Gold Price

కొద్ది రోజులుగా చూస్తే బంగారం ధర పరుగులు పెడుతోంది. వెండి ధర కూడా అదే మార్గం ఎంచుకుంది కానీ, ఈ రోజు మాత్రం బంగారం ప్రియులకు కాస్త గుడ్ న్యూస్ అనే చెప్పాలి. బంగారం కొనుగోలు చేసే వారికి ఇది శుభవార్త. దాదాపు మూడు రోజులుగా పెరిగిన బంగారం ధర శనివారం తగ్గుదల నమోదు చేసింది. మరి నేడు వెండి బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.

గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన బంగారం ధర, ఈరోజు మార్కెట్లో తగ్గుదల నమోదు చేసింది. హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.760 డౌన్ అయింది. దీంతో రేటు రూ.49,640కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా, రూ.700 తగ్గడంతో రూ.45,500కు చేరింది.

బంగారం ధర తగ్గితే వెండి రేటు కూడా భారీగా తగ్గింది. మార్కెట్లో రూ.2000 డౌన్ అయింది వెండి ధర. దీంతో కేజీ వెండి ధర రూ.75,500కు ట్రేడ్ అవుతోంది. ఇక బంగారం వెండి వచ్చే రోజుల్లో మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.