నేడు మంత్రి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు

0
104

గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ఉదయగిరిలోని ఇంజినీరింగ్ కళాశాల వద్ద ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రి భౌతికకాయాన్ని నెల్లూరులోని పోలీసు కవాతు మైదానానికి మంగళవారం ఉదయం తీసుకొచ్చారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో డైకస్‌ మార్గంలోని నివాసానికి తరలించారు. అభిమానుల సందర్శనార్థం క్యాంపు కార్యాలయంలో ఉంచారు.

బుధవారం ఉదయం 6 గంటలకు నెల్లూరులోని మంత్రి నివాసం నుంచి అంతిమయాత్ర మొదలవుతుంది. జొన్నవాడ మీదుగా బుచ్చి, సంగం, నెల్లూరుపాళెం, మర్రిపాడు సరిహద్దు, బ్రాహ్మణపల్లి, నందిపాడు మీదుగా ఉదయగిరిలోని మెరిట్స్‌ కళాశాల వరకు సాగుతుంది. 11 గంటలకు సీఎం జగన్‌ నివాళులర్పించిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఉద‌య‌గిరిలోని మేక‌పాటి రాజ మోహ‌న్ రెడ్డి ఇంజ‌నీరింగ్ కాలేజీ అవ‌ర‌ణ‌లో ఉద‌యం 11:30 గంట‌ల‌కు మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి అంత్య క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ అంత్య క్రియల‌కు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తో పాటు.. ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా హాజ‌రు కానున్నారు.