బంగారం ధర పరుగులు పెడుతోంది.. ఎక్కడా బ్రేకులు పడటం లేదు అనే చెప్పాలి.. గడిచిన మూడు రోజులు తగ్గితే నేడు మళ్లీ పరుగులు పెట్టింది పసిడి ధర..బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం తగ్గింది.
హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 పెరుగుదలతో రూ.51,920కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.350 పెరిగింది..దీంతో ధర రూ.47,600కు చేరింది.
ఇక వెండి ధర మాత్రం కాస్త తగ్గింది,కేజీ వెండి ధర రూ.700 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.66,300కు చేరింది వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయి అంటున్నారు వ్యాపారులు.