నేడు ముచ్చింతల్ స‌మ‌తా మూర్తి కేంద్రానికి రాష్ట్రప‌తి

Today, President Ram Nath visited the Samathamurthy Center

0
97

ముచ్చింతల్‌లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. శ్రీ రామానుజాచార్యుల సంపూర్ణ జీవితం నేడు సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో ప్రతిబింబించనుంది. నేడు దేశ రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ స‌మ‌తా మూర్తి కేంద్రానికి రానున్నారు. ఈ రోజు ఆయ‌న స‌మ‌తా మూర్తి కేంద్రంలో 120 ఏళ్లు జీవితానికి గుర్తుగా 120 కిలోల బంగారంతో తయారు చేసిన స్వ‌ర్ణ‌మూర్తి విగ్ర‌హానికి లోకార్ప‌ణ చేయ‌నున్నారు.

కాగ దీనిలో మై హోం గ్రూప్ అధినేత రామేశ్వ‌ర రావు 27 కిలో గ్రాముల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. అలాగే మ‌రి కొంత మంది విరాళ‌ల‌తో 54 అంగుళాల‌ బంగారు విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాగ రాష్ట్రప‌తి రాకతో హైద‌రాబాద్ లో భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేశారు. దాదాపు 7 వేల మంది పోలీసు బ‌ల‌గాల‌తో భ‌ద్ర‌తను ప‌టిష్టంగా ఏర్పాటు చేశారు. కాగ రాష్ట్రప‌తి రామ్ న‌థ్ కోవింద్ ప్ర‌త్యేక విమానం ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వ‌స్తారు. అక్క‌డి నుంచి రోడ్డు మార్గంలో ముచ్చింతల్ కు చేరుకుంటారు.

బంగారు సమతామూర్తి విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ విగ్రహాన్ని పూర్తిగా ముచ్చింతల్‌లోని జీవాశ్రమంలోనే తయారు చేశారు. మైహోం గ్రూపు అధినేతి జూపల్లి రామేశ్వరరావు 27 కిలోల బంగారాన్ని విరాళమిచ్చారు. అమెరికాకు చెందిన మరో భక్తురాలు 8 కిలోలు అందించారు. ఆశ్రమంలో పనిచేసే కార్మికులు తమ వంతుగా సహాయం చేశారు. ఇలా ఎందరో విరాళంగా ఇచ్చిన బంగారంతో 54 అంగుళాల బంగారు ప్రతిమను రూపొందించారు. విగ్రహం కొలువు దీరిన అంతస్తును ప్రపన్న శరణాగత మండపంగా పిలుస్తారు.