గత నెల ఫ్రిబ్రవరిలో బంగారం ధర భారీగా పెరిగింది.. కాని మార్చి నెల వచ్చేసరికి పుత్తడి పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి..
రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర మళ్లీ స్దిరంగా ఉండిపోయింది.. మళ్లీ పెరుగుదల తగ్గుదల ఏమీ లేదు.. మరి తాజాగా బులియన్ మార్కెట్లో పుత్తడి వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది ఓసారి చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర నిలకడగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,830 దగ్గర ఉంది.. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,010 దగ్గర స్థిరంగా కొనసాగుతోంది. ఇక బంగారం ధర ఇలా ఉంటే వెండి ధర కూడా కొంచెం తగ్గింది నేడు.
వెండి ధర కేజీకి రూ.100 తగ్గింది. దీంతో రేటు రూ.71,600కు చేరింది, వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. గత పదిహేను రోజులుగా పుత్తడి ధరలు దాదాపు 9 శాతం మేర తగ్గాయి.