ఏపీలో ముందస్తు ఎన్నికలపై టాలీవుడ్ హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ లోపే ముందస్తు ఎన్నికలకు జగన్ వెళతారని హీరో శివాజీ పేర్కొన్నారు. అమరావతి రైతుల వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..అధికార పార్టీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్ లో ఉన్నారన్నారు. అంతేకాదు ఓటుకు రూ.50 వేలు ఇచ్చినా.. ఈ సారి వైసీపీ గెలిచే ప్రసక్తి లేదని హీరో శివాజీ జోస్యం చెప్పారు.