టోటల్ గా ఏపీ, తెలంగాణలో ఎన్ని పాజిటివ్ కరోనా కేసులు నమోదు అయ్యాయే తెలుసా…

టోటల్ గా ఏపీ, తెలంగాణలో ఎన్ని పాజిటివ్ కరోనా కేసులు నమోదు అయ్యాయే తెలుసా...

0
87

ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి… ముఖ్యంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏపీతో పోల్చితే తెలంగాణలో ఎక్కువగా నమోదు అయ్యాయి…. ఏపీలో తాజాగా మరో కేసు పాజిటివ్ అని తేలడంతో టోటల్ గా 9కి చేరుకుంది…

కరోనా నేపథ్యంలో మొత్తం 312 మంది శాంపిల్స్ ను సేకరించారు.. వారిలో 289 మందికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది ఇక 13 మంది శాంపిల్స్ కోసం వైద్యులు ఎదురు చూస్తున్నారు… విశాఖ, విజయవాడలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి…

విశాఖలో రెండు విజయవాడలో రెండు కేసులు నమోదు అయినట్లు డాక్టర్లు తెలిపారు… అలాగే తెలంగాణలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 41 చేరుకుంది.. ఇటీవలే సౌదీ నుంచి వచ్చిన బాలుడుకి 43 ఏళ్ల మహిళకు కరోనా సోకినట్లు డాక్టర్లు చెబుతున్నారు…