Breaking News : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్

Tpcc chief Revanth reddy arrested at indrapark

0
115

పెట్రోల్,డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేడు ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు పెట్టిన బారీకేడ్లను తోసేసి అంబేద్కర్ విగ్రహం వైపు ర్యాలీగా వెళ్లారు. ఈ సమయంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో పోలీసులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మధుయాష్కీ, అంజనీకుమార్ యాదవ్ లను అరెస్టు చేశారు. వారిని అంబర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.