ఆసుపత్రిలో విహెచ్ నాకేం చెప్పారంటే ? : రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

0
96

ఆరోగ్యం బాలేక హైదర్ గూడ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మాజీ పిసిసి అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నేత వి హన్మంతరావు. ఆయన ఆరోగ్యం బాలేదని తెలుసుకున్న నూతన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సోమవారం ఆసుపత్రికి వెళ్లి విహెచ్ ను పరామర్శించారు. నిన్నమొన్నటి వరకు రేవంత్ రెడ్డికి పిసిసి పదవి ఇస్తే తాను పార్టీలో ఉండను అని విహెచ్ ఘాటుగా విమర్శలు చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన వ్యక్తికి పిసిసి ఇవ్వమేంటి? అని నిలదీశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా లేఖలు రాశారు. టిడిపి నుంచి వచ్చిన వారికి పిసిసి చీఫ్ పదవి రావొద్దని లాబీయింగ్ చేశారు. కుటుంబం అన్నాక… అవన్నీ సహజం అని రేవంత్ రెడ్డి వాటన్నిటినీ పక్కన పెట్టి ఆసుపత్రికి వెళ్లి విహెచ్ ను పరామర్శించారు.

అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. విహెచ్ తనకు ఏం చెప్పారో మీడియా ముందు వివరించారు. రేవంత్ రెడ్డి కామెంట్స్ చదవండి…

సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోగ్యం బాగోలేదని తెలిసి పరామర్శకు వచ్చాను.

ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదటపడింది.

హాస్పిటల్ లో ఉన్నా విహెచ్… ప్రజా సమస్యలపై నాతో చర్చించారు.

దళితుల విషయంలో వీహెచ్ చాలా కమిటెడ్ గా ఉన్నారు.

రాష్ట్రంలో దళితులకు సీఎం కేసీఆర్ చేస్తున్న ద్రోహం పై పోరాడాలని నాకు సూచించారు.

ప్రపంచంలో అతి పెద్ద ద్రోహి సీఎం కేసీఆరే అని చెపారు.

పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహం పెడితే ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారని విహెచ్ బాధపడ్డారు.

125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతానని చెప్పి.. తట్టెడు మట్టి తీయలేదని నాకు గుర్తు చేశారు.

దళిత ఎంపవర్ మెంట్ అని కేవలం నియోజకవర్గానికి వంద కుటుంబాలకు సహాయం అనడం ద్రోహం అవుంది కదా అన్నారు.

దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు.

పార్టీ అభివృద్ధి విషయంలో కొన్ని కీలకమైన సలహాలు ఇచ్చారు

మేడమ్ సోనియా గాంధీ వద్దకు స్వయంగా కలిసి వెళ్దామని చెప్పారు.

వీహెచ్ సలహాలు సూచనలు తీసుకొని నేను ముందుకు వెళ్తా అని మీడియాతో రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు.