పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం : రేవంత్ రెడ్డి హెచ్చరిక

0
106

గాంధీభవన్ లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు దీపేందర్ సింగ్ హుడా తెలంగాణ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పిసిిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..

దేశంలో అత్యంత ధనవంతుడు నుంచి పేద వాడి వరకు నరేంద్ర మోడీ, కేసీఆర్ దోపిడీ లకు బలవుతున్నారు. కరోనా సమయంలో తినడానికి తిండి లేకుండా.. నడుచుకుంటూ పోతుంటే .. చమురు ధరల పెంపుతో భారం మోపారు. 7 ఏళ్లలో 36 లక్షల కోట్లు దోచుకున్నారు. పెట్రోల్ వాస్తవ ధర 40 రూపాయలు మాత్రమే. 32 రూపాయలు కేసీఆర్, 33 రూపాయలు మోడీ వసూలు చేస్తున్నారు. ధనవంతులు తిరిగే విమానాల్లో కేవలం ఒక్క రూపాయి వసూలు చేస్తోంది. పేదలపై మాత్రమే 32 రూపాయల ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ధనవంతులకు మినహాయింపు ఇచ్చి.. పేదలపై మాత్రం భారం మోపుతున్నారు. రేపు.. ధర్నా చౌక్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ గా వెళ్లి వినతిపత్రం ఇస్తాం.

బంగ్లాదేశ్, బర్మా‌, పాకిస్థాన్ , నేపాల్ వంటి దేశాల్లో మన కంటే తక్కువ కే 30 నుంచి 40 మధ్యనే పెట్రోల్ అందిస్తున్నారు. ప్రజలను దోచుకోవడానికి కోవిడ్ నిబంధనలు అడ్డు రావు కాని.. నిరసనకు అడ్డు వస్తాయా? పార్లమెంట్ లో కూడా ఈ ధరల అంశాన్ని నిలదీస్తాం. రేపటి నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు తరలి రావాలి. రేపటి ర్యాలీ సందర్భంగా అరెస్టు లు చేస్తే ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. అరెస్టు లు చేస్తే.. చలో జైల్ భరో నిర్వహిస్తాం. పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తాం.. ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూస్తాం. ఈ సమావేశంలో పీసీసి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, ఎన్నికల నిర్వాహక కమిటీ చైర్మన్ దామోదర్ రాజ నర్సింహ, వర్కింగ్ ప్రసిడెంట్లు గీతా రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, మహేష్ కుమార్ గౌడ్, నాయకులు షబ్బీర్ అలీ, ఆర్.దామోదర్ రెడ్డి మల్లు రవి, జాఫర్ జావిద్, సునీతారావ్, మాజీ ఎంపీ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు దీపేందర్ సింగ్ హుడా మాట్లాడారు. ఆయన మాటల్లోనే..

deepender singh hooda with revanth reddy

దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోంది. దేశంలో ఆర్థికాభివృద్ధి కంటే.. కరోనా వృద్ధి చెందుతుంది. పెద్ద పెద్ద ప్యాకేజీ లు ప్రకటనలకే పరిమితం అయ్యాయి. కరోనా ఒకవైపు సామాన్య జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుండగా.. పెట్రోల్, డీజల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. డైరెక్ట్, ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ లతో సామాన్యులపై భారం మోపారు. యూపీఏ హయాంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికంటే.. ఎన్డీయే హయాంలో ఒకటిన్నర రెట్లు పెరిగారు. మోదీ ప్రభుత్వం 25 లక్షల కోట్లు ప్రజలపై భారం మోపుతున్నది. ఎక్సైజ్ డ్యూటీ ని భారీ గా పెంచారు. ఈ రోజు చమురుపై 4 లక్షల కోట్లకు పైగా భారం ప్రజలపై మోపుతున్నారు.

దేశంలో అత్యధికంగా వ్యాట్ విధిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు.. యూపీఏ హయాంలో కంటే.. ఎన్డీయే హయాంలో తక్కువగా ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా పేరు చెప్పడమే తప్ప.. దిగుమతులు భారీ గా పెరుగుతున్నాయి. డొమెస్టిక్ గ్యాస్ విషయంలో ప్రభుత్వ సబ్సిడీ దాదాపుగా ఎత్తేశారు. 15.8 శాతానికి డొమెస్టిక్ గ్యాస్ సబ్సిడీ పడిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఉప్పు ,పప్పులు, నూనెలు ప్రతీది భారీ గా పెరిగాయి. ఇలా పెరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటి..? దేశంలో నిరుద్యోగం కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగింది. కోవిడ్ ప్యాకేజీ పేరుతో ప్రకటించిన 20 లక్షల కోట్లు.. ఇవ్వడానికి కాదు.. తీసుకోవడానికి అన్నట్లుగా ఉంది.

అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఒక్క పైసా పెరగలేదు. అప్పుడు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగలేదా..? ఎన్నికలు ముగిసిన వెంటనే క్రూడ్ ధరలు పెరిగాయా? ధరల పెరుగుదలకు నిరసనగా.. రేపు చలో రాజ్ భవన్ చేపట్టాం. ధరల పెరుగుదల పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తాం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మా పోరాటం కొనసాగుతుంది. వాస్తవ ధర కంటే రెండు రెట్లు అదనంగా ట్యాక్స్ లు వేస్తున్నారు. యూపీఏ హయాంలో వాస్తవ ధరలో సగం మాత్రమే ట్యాక్స్ లు ఉండేవి. ఇప్పుడు ఎన్డీయే హయాంలో పూర్తి భిన్నంగా ఉంది.