రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..సభ్యత్వ సంబరాల వాయిదా..కారణం ఇదే!

0
98

గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మెంబెర్షిప్ సమీక్షలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమీక్షలో రేవంత్ మాట్లాడుతూ..దేశంలోనే డిజిటల్ మెంబెర్షిప్ లో తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది. 33 లక్షల మెంబెర్షిప్ సాధించాం. ఇది కాంగ్రెస్ పార్టీ టీమ్ వర్క్ సాధించిన విజయం..ఇంత పెద్ద విజయాన్ని సాధించిన ప్రతి నాయకులను, కార్యకర్తలను అభినందిస్తున్నాము..

కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సంబరాలు చేయాలని అనుకున్నాం కానీ అస్సాం సీఎం రాహుల్ గాంధీ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను, తల్లి పైన దూషించిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన రాష్ట్రంలో ఒక పెద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించాం. దీనిపైన పార్టీలో చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తాం. అప్పటి వరకు కొంతకాలం సభ్యత్వ సంబరాలను వాయిదా వేస్తున్నామని రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.  కాగా అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ఏ అయ్యకు పుట్టినవో అని అడిగినమా అనే వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

ఈ సమీక్షలో ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, పి.ఆర్.ఓ ఉన్నితన్.. వర్కింగ్ ప్రసిడెంట్స్ గీతారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యక్రమాల చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, ఏఐసీసీ కార్యాదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, చిన్నారెడ్డి, డీసీసీ అధ్యక్షులు, సీనియర్ ఉపాధ్యక్షులు పాల్గొన్నారు.