మాకు పి.కే వద్దు గీకే వద్దు : రేవంత్ రెడ్డి సెటైర్

0
96

ప్రఖ్యాత వ్యూహకర్తగా దేశంలో పేరుపొందిన పి.కె. అలియాస్ ప్రశాంత్ కిశోర్ గురించి టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గట్టి సెటైర్ వేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే పి.కే. ను వ్యూహకర్తగా పెట్టుకోవాలని కొందరు సలహా ఇస్తున్నారని చెప్పారు. కానీ… కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త ఒక పి.కే అని స్పష్టం చేశారు. ఇంత మంది పి.కె.లు మాకుండా ఆ పీ.కే మాకేమొద్దు అంటూ పంచ్ విసిరారు.

గాంధీభవన్ లో టిపిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు చదవండి…

కాంగ్రెస్ పార్టీలో అందరి నాయకుల సూచన మేరకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు నాకు అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు… హృదయపూర్వక ధన్యవాదాలు.

నా భాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి వచ్చిన పార్టీ నేతలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

వర్షం పడుతూ ఆ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడు.

పోచమ్మ, ఎల్లమ్మ, లక్ష్మీనరసింహస్వామి ల దయతో పాటు సోనియమ్మ ఆశిసస్సులతో ఈ పదవి చేపడుతున్నా..

సభా వేధిక నుంచి ఈ రోజు చెప్తున్నా జై సోనియమ్మ , రాహుల్ గాంధీ ల నినాదాలు తప్ప మరో నినాదం పార్టీలో వినిపించకూడదు.

సోనియా ,రాహుల్ గాంధీ ల నినాదం మినహా మరో వ్యక్తి నినాదం చేస్తే..ఎంతటి వారినైనా క్షమించం..

నా అభిమానులకు నేను ఓక్కటే విజ్ఞప్తి చేస్తున్నా..ఈ రోజు నుంచి వ్యక్తుల నినాదాలు ఇవ్వకండి.

నిరుద్యోగులు, దళితుల, బడుగు బలహీన వర్గాలను నయవంచనకు టిఆర్ఎస్ ప్రభుత్వం గురిచేసింది.

మన తెలంగాణ తల్లి…తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ.

నాలుగు కోట్ల ప్రజలు తమ ఇళ్ళలో సోనియమ్మ ఫొటో పెట్టుకోవాలి.

నాయకుల సందేశాన్ని ప్రతీ గడపగడపకు తీసుకెళ్ళాలి.

వేలాది మంది సైనికులకు నాయకుడు ముందు ఉంటే..ఈ ప్రపంచాన్ని గెలువొచ్చని చెప్పారు.. అలా ముందుకు నడిపించే సోనియా, రాహుల్ గాంధీ లు ఉన్నారు.

కరోనా కంటే డేంజర్..మోడీ, కేసీఆర్ లు.

ప్రతీ కార్యకర్త రెండు సంవంత్సరాలు ఇంటికి సెలవు పెట్టాలి.

రెండేళ్లు కష్టపడితే..దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.

తెలంగాణ వచ్చినప్పుడు లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉంటే…ఇప్పుడు లక్షా 90వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

కేసీఆర్ ను కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్ర పొలిమేరలు దాటించాలి. అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది.

రావణాసురుడు సీతమ్మ ను ఎం చేసాడో మనకు తెలుసు..

ఇప్పుడు కేసీఆర్ రావణాసురుడు వలె తెలంగాణ తల్లి ని ప్రగతి భవన్ లో బంధీని చేసాడు.

ఆనాడు సీతను రాముడు విముక్తి చేస్తే..ఇప్పుడు తెలంగాణ తల్లి ని విముక్తి చేయమని సోనియమ్మ నన్ను పంపించింది.

రాముడికి వాణరసైన్యం సహాయం చేసినట్లు ..మీరు నాకు సహాయం చేయాలి.

ఏపీ లో కాంగ్రెస్ చనిపోయినా పర్వాలేదు అని తెలంగాణ ఇస్తే.. సోనియా గాంధీ కి కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ప్రతి తెలంగాణ బిడ్డకు ఉంది.