మీడియా మిత్రులు క్షమించాలి : టీపీసీసీ నేత మల్లు రవి

0
96

టీపీసీసీ నూతన కార్యవర్గ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, రేవంత్ రెడ్డి అభిమానులు లక్షలాదిగా తరలిరావడంతో మీడియా ప్రతినిధులకు కొంత అసౌకర్యం కలిగిందని ఆ పార్టీ నేతలు గుర్తించారు.

ఒకవైపు మబ్బులతో వాతావరణంలో మార్పులు, మరోవైపు జన సందోహంతో క్యాడర్ బారికెట్లు పడేసి చొచ్చుకొని రావడంతో మీడియా ప్రతినిధులకు అసౌకర్యం కలిగిందని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి విచారం వ్యక్తం చేశారు. అందుకు మమ్మల్ని క్షమించగలరు అంటూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. భవిష్యత్తు లో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడతాం.. దయచేసి సహకరించగలరు అని పేర్కొన్నారు మల్లు రవి.

గ్రాండ్ సక్సెస్ :

కనీవినీ ఎరుగని రీతిలో టీపీసీసీ కార్యవర్గ పదవీ బాధ్యతల కార్యక్రమం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లక్షలాదిగా స్వచ్చందంగా తరలివచ్చారని కాంగ్రెస్ పార్టీ బలం ఏమిటో బయటపడిందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. స్వచ్చందంగా తరలివచ్చి కార్యక్రమాన్ని ఘన విజయం చేసిన కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.