Breaking: తెలంగాణ- మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిపివేత

0
102

తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిపివేసినట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే అందుబాటులో ఉంటూ ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.