సముద్రంలో ట్రాఫిక్ జామ్ ఈ మాట మనం రెండు రోజులుగా వింటున్నాం అసలు ఏం జరిగింది అనేది చూస్తే
ప్రపంచ దేశాలకు క్రూడ్ ఆయిల్ రవాణా ఎక్కువగా జరిగేది ఈ కెనాల్ మీదుగానే, సూయజ్ కాలువ నౌక రవాణాకు
ఎంతో పెద్ద మార్గం, ఇక మార్చి 23 నుంచి ఈ ఏరియాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది అనేది తెలిసిందే.
ఇప్పటికే ఉత్తర, దక్షిణం వైపు కాలువ మార్గాల్లో 200 వరకు నౌకలు నిలిచిపోయాయి… ఇక ఆ రూట్ వైపు వస్తున్న నౌకలు కూడా అక్కడ మధ్యలో నిలిచిపోయాయి…ఈజిప్టు సమీపంలో మద్యధరా సముద్రం, ఎర్ర సముద్రాలను కలిపే ఈ సూయజ్ కాలువ 193 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ప్రధానంగా చెప్పుకోవాలి అంటే ఆసియా ఐరోపా దేశాలకు ఈ నౌకల ద్వారా రవాణా జరుగుతోంది.
ఎవర్ గివెన్ కంపెనీకి చెందిన 2.2 లక్షల టన్నుల భారీ సరుకు రవాణా నౌక బలమైన గాలుల కారణంగా సూయజ్ కాలువ మార్గంలో చిక్కుకుపోయింది…దీంతో ముందుకు వెనక్కి నౌకలు వెల్లడానికి లేకుండా నిలిచిపోయింది, దీని వల్ల చాలా దేశాలకు నష్టం వాటిల్లింది.
|
|
సముద్రంలో ట్రాఫిక్ జామ్ ఈ నౌక ఏమిటి ఆ స్టోరీ ఏమిటి
-