వాహనదారులు ఇలాంటి తప్పు చేస్తే ఇక జైలుకే 10 ఏళ్ల జైలు శిక్ష – సీపీ సజ్జనార్

వాహనదారులు ఇలాంటి తప్పు చేస్తే ఇక జైలుకే 10 ఏళ్ల జైలు శిక్ష - సీపీ సజ్జనార్

0
105

చేతిలో బైక్ కారు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు కొందరు డ్రైవ్ చేస్తూ ఉంటారు, వారి ప్రాణాల గురించి లెక్క చేయరు, పక్కన వారి ప్రాణాలను కూడా ఇరకాటంలో పాడేస్తున్నారు కొందరు, ఇలాంటి వారి వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి, అంతేకాదు ఇలా యాక్సిడెంట్లలో ఏకంగా ప్రాణాలు కోల్పోతున్న వారు ఉన్నారు, రాష్ డ్రైవింగ్ తో పాటు మద్యం సేవించి బండి కారు నడిపి పక్కవారి ప్రాణాలు కూడా పోయేలా కారణం అవుతున్నారు.

హైదరాబాద్ పోలీసులు ఇలాంటి వారికి సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హెచ్చరిస్తున్నారు. అతివేగం, నిర్లక్ష్యంగా మద్యం మత్తులో వాహనం నడుపుతూ ఇతరుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు.

ఇలాంటి వారిని వదిలిపెట్టేదిలేదని తెలిపారు, అంతేకాదు ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై ఐపీసీ 304 పార్టు-2 కింద నేరపూరితమైన హత్యగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిందితులకు పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని సీపీ తెలిపారు. ఇటీవల ఇలాంటి ప్రమాదాలకు కారణమైన వారిపై ఇలాంటి కేసులు పెట్టారు, సో పేరెంట్స్ కూడా మీ పిల్లల విషయంలో
జాగ్రత్తలు చెప్పాలి, రాత్రి 12 తర్వాత మద్యం తాగి, అలాగే పబ్ లనుంచి ఇంటికి వచ్చే క్రమంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి అంటున్నారు అధికారులు.