Flash: విషాదం..కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మృతి..

0
91

రాజకీయంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పండిట్‌ సుఖ్‌ రామ్‌ బ్రెయిన్‌ స్ట్రోక్‌ తో మరణించి కాంగ్రెస్ పార్టీలో తీరని విషాదాన్ని మిగిల్చారు.  బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో కుటుంబ సభ్యులు ఎయిర్‌ అంబులెన్స్‌ లో న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

అనంతరం సుఖ్‌ రామ్‌ను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమించినట్టు కుటుంబసభ్యులకు తెలియజేసారు. దాంతో  మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌రువాత అతను మృతి చెందడం జరిగింది. ఈయన మరణ వార్త విన్న కాంగ్రెస్ నేతలు అతనికి సంతాపం వ్యక్తం చేసారు. ఈయన రక్షణ ఉత్పత్తి, సరఫరాలు, ప్రణాళిక, ఆహారం, పౌర సరఫరాల శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు.