Flash: రాజకీయంలో విషాదం..టిడిపి సీనియర్ నేత కన్నుమూత

0
82

రాజకీయంలో తీరని విషాదం చోటుచేసుకుంది. టీడీపీ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మృతి చెందారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే అతను కాసేపటి క్రితమే గుండెపోటుతో బాధపడుతూ వైద్యుల సమక్షంలో మరణించడం అందరిని కలచి వేస్తుంది.

ఈయన మరణ వార్త విన్న టీడీపీ నేతలు సంతాపం తెలియజేస్తున్నారు.  శ్రీకాళహస్తి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు టిడిపి లో మంత్రిగా పని చేశారు. అయితే గత కొంతకాలంగా  ఆయన ఆరోగ్యం సహకరించక పోవడంతో తన వారసుడ్ని రాజకీయాల్లోకి ప్రవేశపెట్టాడు. ఇప్పటికే ఒకసారి అలిపిరిలో నక్సల్స్ దాడిలో ప్రాణాలతో బయటపడ్డ ఈయన ఇప్పుడు మృతి చెంది అందరికి కంటతడి పెట్టించాడు.