Breaking: వైసీపీలో విషాదం..గుండెపోటుతో మంత్రి మృతి

Tragedy in YCP..Minister dies of heart attack

0
124

ఏపీ వైసిపిలో విషాదం నెలకొంది. ఏపీ పరిశ్రమలు ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చెందారు. గత వారం రోజుల పాటు దుబాయ్ పర్యటనలో మంత్రి గౌతమ్ రెడ్డి ఉన్నారు. ఐటీ శాఖకు సంబంధించిన వ్యవహారాలపై మంత్రి గౌతమ్ రెడ్డి.. దుబాయ్‌ వెళ్లారు. అయితే.. దుబాయ్‌ పర్యటన చూసుకుని నిన్ననే హైదరాబాద్ కు తిరిగి వచ్చిన మంత్రి గౌతమ్ రెడ్డికు.. ఇవాళ ఉదయమే గుండెపోటు వచ్చింది.

దీనితో ఆయనను హుటాహుటీన హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ గౌతమ్ రెడ్డి మృతి చెందారు. కాగా 2019లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుండి వైసీపీ ఎమ్మెల్యేగా గౌతమ్ రెడ్డి గెలుపొందారు.