విషాదం: ఆగిన ప్రధానోపాధ్యాయుడి గుండె..బదిలీనే కారణం!

Tragedy: Stopped headmaster's heart..cause transfer!

0
98

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన టీచర్ల బదిలీలు ఓ ప్రాణాన్ని పొట్టనబెట్టుకున్నాయి. పని చేస్తున్న జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ కావడంతో మనోవేదనతో ఓ ప్రధానోపాధ్యాడు గుండెపోటుతో మరణించారు. దీనితో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో గురువారం రాత్రి జరిగింది.

మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బాణోత్ జెత్రం నెల్లికుదురు మండలం చిన్న ముప్పారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పని చేసేవారు. ఉద్యోగుల జిల్లా కేటాయింపుల్లో ఆయనను ములుగు జిల్లాలోని ఓ పాఠశాలకు బదిలీ చేశారు. అప్పటి నుంచి ఆయన అంత దూరం ఎలా వెళ్లాలనే ఆలోచనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో ఇంట్లో గుండెపోటుతో గురువారం సాయంత్రం మరణించారు.

తన తండ్రి మరణంపై బాధితుడి కొడుకు గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మా అమ్మ అంగన్వాడీ టీచర్. భార్యాభర్తలు ఒకే జిల్లాలో డ్యూటీ చేయాలని చెప్పినా కూడా పరిగణనలోకి తీసుకోలేదు. సొంత జిల్లా మహబూబాబాద్ జిల్లా కాకుండే వేరే జిల్లాకు ఎలా బదిలీ చేస్తారు. బదిలీ చేయడం వల్లనే మా డాడీకి ఇలా జరిగింది. మా నాన్న పెరాలసిస్​తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదు. ట్రాన్స్​ఫర్ చేసి మా కుటుంబ పెద్ద దిక్కును లేకుండా చేశారు. ఇప్పుడు మాకు దిక్కెవరంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.