ఈ రోజుల్లో ట్రైన్ టికెట్ చేసుకోవాలి అంటే చాలా మందికి తత్కాల్ విషయంలో చాలా ఇబ్బంది ఉంటోంది, మరీ ముఖ్యంగా కొందరు ఏజెంట్లకు మాత్రమే టిక్కెట్లు పూర్తి అవుతున్నాయి.. బయట వారికి అవకాశం ఉండటం లేదు…
అయితే చాలా వరకూ మీరు ఏజెంట్లని ఆశ్రయించకుండా టిక్కెట్లు చేసుకోవాలి అని అధికారులు చెబుతున్నారు. టికెట్లను అక్రమంగా పెద్ద ఎత్తున బుక్ చేసేందుకు కొందరు పలు రకాల సాఫ్ట్ వేర్లు ఉపయోగిస్తున్నారని, అలాంటి వారిని అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
ఇలా ఎవరైనా టికెట్లు బుక్ చేస్తే కచ్చితంగా సాఫ్ట్ వేర్ సాయంతో వారిని పట్టుకుంటాము అన్నారు, అయితే వచ్చే రోజుల్లో ఏంజెంట్స్ లేకుండా నిషేదం విధించే దాని గురించి ఆలోచిస్తాము అని చెప్పారు రైల్వే మంత్రి… తాజాగా ఈ మాట చెప్పడంతో ఇక టికెట్లు బుక్ చేసే వారు బల్క్ టిక్కెట్లుచేసే వారు ఆలోచనలో పడ్డారు.