ఈ కరోనా మహమ్మారి దేశంలో వేగంగా విస్తరిస్తోంది, ఈ సమయంలో రవాణా విషయంలో బస్సులు రైళ్లు చాలా వరకూ నిలిచిపోయాయి, అంతరాష్ట్ర బస్సు సర్వీసులు చాలా స్టేట్స్ నడపడం లేదు, అయితే రైళ్లు మాత్రం కొన్ని ప్రత్యేక సర్వీసులు నడుస్తున్నాయి.
ఈ నేపధ్యంలో ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ మెయిల్, ఎక్స్‌ప్రెస్, సబర్బన్, ప్యాసింజర్ సర్వీసుల రద్దును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరో రెండు నెలల వరకూ అన్నీ రైళ్లు నడిచే అవకాశం లేదు.
అయితే దాదాపు మార్చి చివరి వారం నుంచి ఇదే పరిస్దితి, ఇక కేవలం రాజధాని నుంచి అలాగే మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ రెండువందల రైల్లు ఈ కరోనా సమయంలో నడుపుతున్నవి మాత్రమే నడవనున్నాయి, కేసులు పెరగడంతో ఇప్పుడు అన్నీ రైల్ సర్వీసులు నడపకూడదు అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.