తెలంగాణలో ఆరుగురు డిఎస్పీల బదిలీ

0
123

తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు డీఎస్పీల బదిలీ జరిగింది. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సిసిఎస్ ఏసిపి రవీంద్ర రెడ్డిని సంగారెడ్డి డీఎస్పీగా బదిలీ చేశారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న బాలాజీని డిజిపి కార్యాలయానికి స్థానచలనం కల్పించారు.

హైదరాబాద్, బేగంపేట ఏసిపి నరేష్ రెడ్డిని మల్కాజిగిరి ఏసీపీ గా నియమించారు. ఆ స్థానంలో ఉన్న శ్యాం ప్రసాద్ రావును డిజిపి కార్యాలయానికి బదిలీ చేశారు. ఖమ్మం జిల్లా వైరా డిఎస్పీగా రెహమాన్ కి పోస్టింగ్ ఇచ్చారు. ఆ స్థానంలో ఉన్న సత్యనారాయణను డిజిపి కార్యాలయానికి బదిలీ చేశారు. అలాగే రవాణా శాఖ కమిషనర్ గా డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాష్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు.

మూడు నెలల క్రితం ఎంఆర్ఎం రావు బదిలీపై వెళ్లిన అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. కాగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే బుద్ధప్రకాష్ జాయింట్ కమిషనర్ రమేష్, మమతా ప్రసాద్, పాండు రంగ నాయక్, డిప్యూటీ కమిషనర్ పాపారావులతో సమావేశమై రవాణాశాఖ కార్యకలాపాలను సమీక్షించారు.