ట్రావెల్ పాస్ లపై ఏపీ ప్రజలకు గుడ్న్యూస్..

ట్రావెల్ పాస్ లపై ఏపీ ప్రజలకు గుడ్న్యూస్..

0
91

ఇప్పటి వరకూ ప్రజలు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాలి అని అనుకున్నా ట్రావెల్ పాస్ లు తప్పనిసరిగా కావాలి, అయితే ఈసారి ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు పోలీసులు..రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లాలంటే పాస్లు అవసరం లేదు. అంతర్ జిల్లాల్లో పాస్లు లేకుండా తిరగొచ్చంటోంది. శుక్రవారం నుంచి అనుమతి ఇచ్చినట్లు పోలీసులు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ఇక ఎవరైనా వేరే స్టేట్ నుంచి ఏపికి రావాలి అంటే మాత్రం కచ్చితంగా అప్లై చేసుకోవాలి..కారుల్లో ముగ్గురికి మించకుండా ప్రయాణించవచ్చన్నారు. అలాగే… మాస్కులు ధరించడం, సోషల్ డిస్టన్స్ పాటించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా అమలవుతాయి.

అలాగే రెడ్, ఆరెంజ్ జోన్స్.. కంటైన్మెంట్ ప్రాంతాల్లో మాత్రం నిబంధనలు కొనసాగుతాయంటున్నారు. అంతేకాదు ఉదయం ఏడు గంటల నుంచి, రాత్రి ఏడు గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు, రాత్రి ప్రయాణాలు కుదరవు, ఏడు లోపు వెళ్లిపోవాలి.