సీఎం కేసీఆర్ దేవుడి లాంటి వ్యక్తి అని..తమ నాయకుడిని విమర్శిస్తున్నారనే ఆవేదనతో రాజ్ భవన్ ఎదుట టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించారు. రాజ్‌భవన్ ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. మహా ధర్నా అనంతరం తెరాస బృందం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు వినతిపత్రం ఇవ్వడానికి బయలుదేరారు.
ఆ సమయంలో వారి వాహనాలు వచ్చే ముందు సూర్యాపేట జిల్లాకు చెందిన నాగార్జున అనే తెరాస కార్యకర్త..అకస్మాత్తుగా రాజ్ భవన్ ఎదుట రోడ్డుపైకి వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అడ్డుకున్నారు.