Flash: గ్యాంగ్​రేప్​ కేసులో కీలక నిందితుడిగా టిఆర్​ఎస్​ నేత కొడుకు అరెస్ట్

0
75

తెలంగాణలో 20 ఏళ్ళ యువతికి కూల్​డ్రింక్​లో మత్తు మందు ఇచ్చి 2 రోజుల పాటు గ్యాంగ్​ రేప్​ చేసిన  ఘటన తెలంగాణలో సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనలో టిఆర్ఎస్ కౌన్సిలర్ కుమారుడు షేక్ గౌస్ మరో నిందితుడు సాయిరామ్ ను పోలీసులు అరెస్టు చేసారు. బాలిక స్పృహలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్నీ తెలియజేయడంతో పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గత శుక్రవారం రాత్రి 9.30 గంటలకు తనను వీరిద్దరూ కిడ్నాప్​ చేసి ఆటోలో తీసుకెళ్ళి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్టు యువతీ పిర్యాదు చేసింది.