తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీలో మూడు ముక్కలాట కొనసాగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు… ఇటీవలే పార్టీ హైకమాండ్ ఆయా నాయోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలదే బాధ్యత అలాగే పెత్తనం ఉంటుందని స్పష్టం చేసింది దీంతో చాలమంది టీఆర్ఎస్ నాయకులకు ఇంచార్జ్ లకు అధిష్టానం తీసుకున్న నిర్ణయం మింగుడుపడకుందట…
రెండోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన డజనుకు పైగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గులాబీ గూటీకి చేరారు…. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఆదిపత్య పోరు కొసాగుతోంది… ముఖ్యంగా టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు వంటి వారు సైతం అధిష్టానంపై గుర్రున ఉన్నారట…
గత ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు తుమ్మల… ఆయన పై పోటీ చేసి గెలిచిన ఉపేంద్ర రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు.. దీంతో ఇక్కడ ఆదిపత్యపోరు కొసాగుతోంది… అలాగే పార్టీలో చేరిన ఆయా నియోజకవర్గాల్లో కూడా ఆదిపత్య పోరు కొసాగుతోంది… దీంతో టీఆర్ఎస్ నాయకులు రెండువర్గాలుగా విడిపోయారు… అలాగే గత ఎన్నికల్లో టికెట్ దక్కని వారు కూడా ఒక వర్గంగా విడిపోయారని వార్తలు వస్తున్నాయి…