Breaking News- ఈనెల 18న టీఆర్ఎస్ మహాధర్నా

TRS Mahadharna on the 18th of this month

0
88

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మరోసారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 18న ఇందిరాపార్క్‌లో తెరాస మహాధర్నా చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 వరకు ఈ ధర్నా చేయనున్నారు. ఈ మహాధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొననున్నారు. మహాధర్నా అనంతరం గవర్నర్ తమిళిసై కి వినతిపత్రం ఇవ్వనున్నారు. గత కొద్దిరోజులుగా ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.