యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలంటూ లోక్‌సభలో ఆందోళన చేపట్టిన తెరాస..కేంద్రం తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసింది. జాతీయ ధాన్యం సేకరణ విధానం, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేసింది.
లోక్‌సభ ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన వెంటనే తెరాస ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యాసంగిలో ధాన్యం సేకరణపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ అంశంపై చర్చించాలంటూ నామ నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. 176 నిబంధన కింద రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ చేపట్టాలని కేశవరావు కూడా నోటీసు ఇచ్చారు.
రెండు సభల్లో తెరాస సభ్యులను నోటీసులపై చర్చకు అంగీకరించలేదు. లోక్‌సభలో స్పీకర్ నిర్ణయాన్ని నిరసిస్తూ.. నామ సభ్యుల బృందం సభ నుంచి వాకౌట్ చేసింది.