Breaking: టీఆర్ఎస్ మంత్రికి కరోనా పాజిటివ్

0
76
RT-PCR mandatory

కరీంనగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరోనా బారిన పడ్డారు. శనివారం నిర్వహించిన పరీక్షలలో ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉందని పేర్కొన్నారు. అయితే ఇటీవల తనను కలిసిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు.