టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో మోదీ అసలు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడారని మంత్రి ఎద్దేవా చేశారు. ఇప్పుడు విభజన చట్టం గురించి ఎందుకు వచ్చిందని.. ఇది పొలిటికల్ డ్రామా అంటూ.. తలసాని విమర్శించారు. ప్రతిపక్షాలు బలంగా లేని సమయంలోనే రాజకీయంగా మార్పులు వస్తాయని తలసాని అన్నారు. ఇది చరిత్ర చెబుతోందని.. రాబోయే కాలంలో అదే జరుగుతుందని అన్నారు.
రాబోయే 5 రాష్ట్రాల్లో బీజేపీకి గుణపాఠం చెప్పడం ఖాయమని తలసాని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఓడిపోతుందని.. జోస్యం చెప్పారు. దేశ రాజకీయాలు కేసీఆర్ తో ప్రారంభం అవుతాయని ఆయన అన్నారు. మేం కూడా ఈ దేశంలో భాగస్వాములమే అని..దేశానికి నష్టం జరుగుతుంటే ఊరుకోమని అన్నారు.