ఫ్లాష్: టీఆర్ఎస్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

0
114

తెలంగాణ రాష్ట్ర మైనార్టీ, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని టీఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దళితుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పథకాన్ని అమలుచేస్తున్నారని.. ఇప్పటికే మొదటివిడతగా 32వేల కుటుంబాలకు ఈపథకంలో లబ్ధి చేకూరిందన్నారు.

దేశ వ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితుల అభ్యున్నతిని కేంద్రం కోరుకుంటే తక్షణమే తెలంగాణలో టీఆర్ ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాన్ని మోడల్ గా తీసుకుని దేశ వ్యాప్తంగా అమలుచేయాలన్నారు. దేశ వ్యాప్తంగా దళితబంధు పథకం రావాలని అనేక రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగి పోయాయని ఆరోపించారు. దళితులను దేవాలయాలకు రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.

సెప్టెంబర్ 17కు ఓ చరిత్ర ఉందని, బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే తెలంగాణ విలీన దినోత్సవాన్ని వాడుకుని.. రాజకీయ ప్రయోజన్ పొందాలని చూస్తోందని ఆరోపించారు. మూడు రోజుల పాటు ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవాలు జరుపుకుంటున్నాంమని.. ఏడాది పాటు వివిధ కార్యక్రమాలుండేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.