టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంట్లో విషాదం

trs mla balka suman father died

0
100

టిఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడ్డ ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. బాల్క సుమన్ తండ్రి, మెట్ పల్లి మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బాల్క సురేష్ కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా బాల్క సురేష్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో బాల్క సుమన్ కుటుంబంలో విషాదం నెలకొంది.

బాల్క సురేష్ మరణం పట్ల తెలంగాణ సిఎం కేసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. బాల్క సుమన్ ను ఫోన్ లో పరామర్శించారు కేసిఆర్. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంతేకాకుండా పలువురు టిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బాల్క సుమన్ ను పరామర్శించారు. సానుభూతి తెలిపారు.