ప్రాణాలు తీసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే కారు..

ప్రాణాలు తీసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే కారు..

0
91

కల్వకుర్తి టిఆర్ఎస్ ఎమ్మెల్యే గుర్కా జై పాల్ యాదవ్ కారు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. దీంతో భయపడిన ఎమ్మెల్యే ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ శ్రీశైలం రహదారిపై జరిగింది.

తుమ్మలూరు లో మేస్త్రి పని చేసి జీవనం సాగిస్తున్నాడు శ్రీకాకుళంకు చెందిన జగన్నాథం. ఆదివారం రాత్రి రోడ్డు దాటుతున్న జగన్నాతన్ని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కారు ఢీకొన్నది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు జగన్నాథం. దీనిని గమనించిన ఎమ్మెల్యే డ్రైవర్ తో కలిసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న జగన్నాథ కుటుంబసభ్యులు రోడ్డుపై బైఠాయించారు.

తమకు న్యాయం చేసి ప్రమాదానికి కారణమైన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వీరి ఆందోళనతో రహదారిపై ట్రాఫిక్ జాం అయ్యింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని నచ్చజెప్పి, నిందితునిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.