మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే

TRS MLA receiving Man of the Match

0
96

తెలంగాణ: ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా అచ్చంపేట స్టేడియంలో జరిగిన మహరాష్ట్ర జట్టు, ఆర్ఫాన్ సీసీ జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్ లో ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు క్రిడాకారుడిగా తన ప్రదర్శన ద్వారా సత్తా చాటారు.

ఆర్ఫాన్ సీసీ జట్టులో సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్యే ఈ మ్యాచ్ లో 16 బంతులు వేసి 21 పరుగులు ఇచ్చి 4 వికెట్లు కూడా తీసి మ్యాచ్ ను మలుపు తిప్పారు. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించడంతో ఎమ్మెల్యే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కైవసం చేసుకున్నారు. ఎమ్మెల్యేగా నిత్యం ప్రజా సమస్యల్లో బిజీగా ఉంటూనే మరోవైపు క్రిడాకారుడిగా తనదైనశైలిలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. క్రిడాకారుడిగా ఎమ్మెల్యే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందడంతో ఇతర క్రీడాకారులు అభినందించారు.

ఈ టోర్నమెంట్ లో ఎమ్మెల్యే ఆడిన మూడు మ్యాచ్లలో ప్రతి మ్యాచ్ లో రెండు వికెట్ల చొప్పున తీసి ఆదివారం జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొట్టి మొత్తం ఎనిమిది వికెట్లు తీశారు. రసవత్తరంగా కొనసాగుతున్న ఈ టోర్నమెంట్లో ఎమ్మెల్యే క్రీడాకారుడిగా తన సత్తాను చాటి ఇతర క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారు.