Flash News- టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

TRS MLA sensational allegations

0
96

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాదు.. బురద సంజయ్, గుండా సంజయ్ అని తీవ్ర కామెంట్స్ చేశారు. పశ్చిమ బెంగాల్ వాతావరణాన్ని తెలంగాణలో తెచ్చేందుకు బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని నిప్పుల చెరిగారు.

దేశంలో 36 పార్టీల మెడలు వంచి ఒప్పించి తెలంగాణ తెచ్చిన చరిత్ర కేసీఆర్‌ది అని అన్నారు. రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొడతాం అంటే చూస్తూ ఊరుకోబోమన్నారు.  పశ్చిమబెంగాల్‌లో చేసినట్లు గుండాయిజం చేస్తామంటే కుదరదని, ఇది తెలంగాణ అనే విషయాన్ని మరిచిపోవద్దని అన్నారు. గుండా రాజకీయం చేస్తే బట్టలువిప్పి రైతులు ఉరికిచ్చి కొడతారని బీజేపీ నేతలకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.