నోరు జారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..నా వల్లే ఈ పిల్లలు పుట్టారని వ్యాఖ్య

TRS MLA with a slip of the tongue

0
91

వదిలిన బాణం..విడిచిన మాట రెండూ డేంజరే.. ఎక్కడ టంగ్ స్లిప్ అయినా కూడా ఈ సోషల్ మీడియా యుగంలో ఓ ఆట ఆడుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు
స్టేషన్ ఘన్ పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నోరు జారారు. ఒక అర్థంలో మాట్లాడబోయి ఇంకో అర్థంలోకి మారిపోయారు. దీంతో అది కాస్త వివాదాస్పదమవుతోంది. ఆయన ఇప్పటికే పలుమార్లు పలు వివాదాల్లో దూరినా ప్రస్తుతం అచ్చంగా దొరికిపోయారు.

స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిథిగా రాజయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాకముందు తాను ఒక ప్రముఖ పిల్లల డాక్టర్ ను వైద్యుడిగా దాదాపు 18,70,000 మంది పిల్లలను చూసిన. వరంగల్‌ జిల్లా మొత్తంలో అప్పుడు పిల్లల డాక్టర్‌ను నేను ఒక్కడినే.  24 గంటలు కన్నార్పకుండా, బుక్కెడు బువ్వ తినకుండా పిల్లలను బతికించడానికి సర్వశక్తులు ఒడ్డి పని చేస్తే..అయ్యా ఇగో ఇవ్వాల నీవల్లనే పుట్టిండు, నీవల్లనే ఇంత గొప్పగా ఎదిగిండు. నీవల్లనే బతికిండు అంటూ పొగుడుతున్నారని అన్నారు.  ఉద్దేశ పూర్వకంగానే పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నారా? లేక టంగ్ స్లిప్ అవుతున్నారా అని ప్రజల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. దీనిపై ట్రోల్స్ కూడా సాగుతున్నాయి.