ఫ్లాష్..ఫ్లాష్: రాజ్యసభను బహిష్కరించిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు

0
95

దేశ ప్రధాని నరేంద్ర మోడి రెండు తెలుగు రాష్ట్రాల విభజనపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన చేసిన వ్యాఖ్యలతో.. టీఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించి.. నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు తెలిపాయి. ఇక తాజాగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలు రాజ్య సభను బహిష్కరించారు. ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఒక్క రోజు మాత్రం రాజ్య సభను బాయ్‌ కాట్ చేస్తున్నట్లు చెప్పారు టీఆర్‌ఎస్ ఎంపీలు.