పవన్ కు షాక్ ఇచ్చిన టీఆర్ఎస్

పవన్ కు షాక్ ఇచ్చిన టీఆర్ఎస్

0
133

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ భారీ షాక్ ఇచ్చింది…. రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఆర్టీసీ కార్మికులు బంద్ కు ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. వారికి మద్దతుగా నిలుస్తామని జనసేన పార్టీ తరపున పవన్ కూడా ఇటీవలే ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.

ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఆర్టీసీ కార్మికుల రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ తరపున ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్ హాజరయ్యారు ఆయన్ను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు… ఆయనతో పార్టీ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు…

దీంతో తమనేతల అక్రమ అరెస్ట్ ను జనసేన తప్పుపట్టింది… ఈ సందర్భంగా జనసైనికులు మాట్లాడుతూ… అరెస్ట్ లతో ఈ పోరాటాన్ని ఆపలేరని హెచ్చరించింది. హైకోర్ట్ సూచన మేరకే ప్రభుత్వ కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు…