స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం

TRS solid victory in local body quota MLC elections

0
68

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెరాస విజయఢంకా మోగించింది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఆరు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అన్నిస్థానాల్లోనూ తెరాస గెలుపొందింది. ఖమ్మం, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్​, కరీంనగర్​లోని రెండు స్థానాలు గులాబీ వశమయ్యాయి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలకు చెందిన రెండు చొప్పున స్థానాలు, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఒకటి చొప్పున స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 2 స్థానాల్లో తెరాస అభ్యర్థులు భానుప్రసాద్, ఎల్.రమణ విజయం సాధించారు. భానుప్రసాద్‌ కు 584, ఎల్.రమణ 479 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి రవీందర్‌సింగ్‌కు 232 ఓట్లు వచ్చాయి. అలాగే ఆదిలాబాద్​లోనూ తెరాస విజయం సాధించింది.