టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ

టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ

0
44

కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్, సహాయ మంత్రి రామేశ్వర్ తెలి నిజామాబాద్ జిల్లాలో స్మార్ట్ ఆగ్రో మెగా ఫుడ్ పార్క్ ను ప్రారంభించారు. నందిపేట్ మండలం
లోని లక్కంపల్లిలో ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కలెక్టర్ ఎంఆర్‌ఎం రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా, ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ అరవింద్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వర్గీయులు పోటా పోటీ నినాదాలు చేశారు. బీజేపీ ఎంపీ అరవింద్ సభలో ప్రసంగిస్తున్న సమయంలో ‘కేసీఆర్..కేసీఆర్’ అంటూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు., టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రసంగిస్తుండగా ‘మోదీ..మోదీ’ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇలా టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు ఒకరిని మించి ఒకరు నినాదాలు చేశారు.