“రాజ్యాంగం గ్రామాలకు చేరుకున్నప్పుడే నిజమైన రాజ్యాంగ స్ఫూర్తి వెల్లివిరుస్తుంది”

"True constitutional spirit emerges only when the constitution reaches the villages"

0
71

ఈరోజు రాజ్యాంగ దినోత్సవం, సంవిధాన్ దినోత్సవం సందర్బంగా లాప్ సంస్థ  గ్రామాలు రాజ్యాంగం అనే అంశంపై  రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. లాప్ సంస్థ వ్యవస్థాపకులు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సీనియర్ న్యావాదులు పి. నిరూప్ రెడ్డి, ఎం. సురేష్ రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

వివిద రంగాలకు చెందిన వ్యక్తులు ఈ అంశం పై తమ అభిప్రాయాలు వెల్లడించారు. సుప్రీం కోర్ట్ న్యాయవాది పి. నిరూప్ రెడ్డి మాట్లాడుతూ..గ్రామాలలో సమర్ధవంతమైన న్యాయసేవలు అందించగలిగినపుడే గ్రామీణులు న్యాయం పొందగలుగుతారని అప్పుడే రాజ్యాంగ ఫలాలు గ్రామాలకు చేరుతాయని పేర్కొన్నారు. ఇందుకోసం పూనుకున్న లాప్ సంస్థని అభినందించారు. సగం భారత దేశం గ్రామాలలోనే ఉంది రాజ్యాంగం గ్రామాలకు చేరుకున్నప్పుడే నిజమైన రాజ్యాంగ స్ఫూర్తి వెల్లివిరుస్తుంది.

న్యాయవాది మేక సురేష్ రెడ్డి మాట్లాడుతూ..న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ దురదృష్టవశాస్తూ రాజ్యాంగ వ్యవస్థని పటిష్టం చేయడం కోసం ఆశించిన మేరకు ప్రయత్నాలు జరగడం లేదు, న్యాయ వ్యవస్థని గ్రామాలకు దగ్గర చేయడం కోసం రూపొందించిన గ్రామ న్యాయాలయాల చట్టం ఇంకా అమలుకు నోచుకోకపోవడం శోచనీయం అని పేర్కొన్నారు. లా విద్యార్థులకు సరియైన తర్ఫీదు లేకపోవడం లా పట్టభద్రులు ఎక్కువమంది పల్లెల్లో పని చేయడానికి ఆసక్తి చూపకపోవడం పల్లె ప్రజలకు న్యాయసేవలు దూరం చేస్తుంది.

లాప్ సంస్థ న్యాయ సేవలను పల్లె ప్రజలకు అందించాలనే లక్ష్యంతో పని చేయడంపై సంతోషం వెలిబుచ్చారు. ఈ సందర్బంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ..చట్టం పల్లెలకు చుట్టం అయినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలో పేర్కొన్న ఉచిత న్యాయ సేవలు పల్లెలకు అందాలి. రాజ్యాంగంలో పేర్కొన్న భూ హక్కులను కాపాడడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశానికి హాజరైన అందరికి లాప్ సంస్థ మేనేజింగ్ పార్టనర్ అభిలాష్ ధన్యవాదాలు తెలిపారు.