ట్రంప్ అమెరికా వెళ్లిపోయినా వర్మ వదలడం లేదు

ట్రంప్ అమెరికా వెళ్లిపోయినా వర్మ వదలడం లేదు

0
151

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనకు రెండు రోజులు వచ్చారు వెళ్లారు …అన్నీ సవ్యంగా జరిగాయి.. ఇరు దేశాలు ఫుల్ హ్యపీగా ఉన్నాయి, నమస్తే ట్రంప్ కార్యక్రమం కూడా బాగా జరిగింది, ప్రజలు కూడా బాగా వచ్చారు, అయితే ఆయన టూర్ మొత్తం సోషల్ మీడియా నుంచి శాటిలైట్ మీడియా వరకూ రెండు రోజులు అదే నడిచింది.

అన్నీ దేశాలు ట్రంప్ భారత్ టూర్ పైనే ఫోకస్ చేశాయి., అయితే ట్రంప్ టూర్ పై సోషల్ మీడియాలో కొన్ని సటైర్లు వచ్చాయి, ఆయన కొందరి పేర్లు తప్పు పలికారు అని పలు పదాలు సరిగ్గా పలకలేదు అని సటైర్లు వేశారు, కాని తాజగా వర్మ ట్రంప్ టూర్ పై ఓ సటైర్ వేశారు..

ట్రంప్: మిస్టర్ మోదీ, నన్ను చూసేందుకు 70 లక్షల మంది వస్తారని చెప్పారు. కానీ వచ్చింది లక్ష మందే కదా

మోదీ: మిస్టర్ ట్రంప్ … మీరిక్కడో విషయం గమనించాలి! ఒక డాలర్ తో 70 రూపాయలు సమానమైతే, ఒక గుజరాతీ 70 మంది అమెరికన్లకు సమానం..

వర్మ సటైరిక్ గా వేసినా డాలర్ రేటు ప్రకారం సెట్ అయింది …అదే ఏ 90 రూపాయలో అరవై రూపాయలో డాలర్ రేటు ఉండి ఉంటే ఈ కామెంట్ సెట్ అయ్యేది కాదు అంటున్నారు కొందరు నెటిజన్లు.