తాజ్ మహల్ అంటే సుందరమైన ప్రదేశం.. మన దేశంలో గొప్ప కట్టడాల్లో అది కూడా ఒకటి ఆగ్రా వెళితే కచ్చితంగా తాజ్ మహల్ చూడాలి అని అనుకుంటారు, అయితే తాజాగా ఇక్కడ పర్యాటకుకు ఓ బెడద ఎక్కువ అయిందట.
గత ఆరు నెలలుగా తాజ్ మహల్ ప్రాంగణంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, తమ చేతుల్లోని వస్తువులను కోతులు లాక్కెళుతున్నాయని సందర్శకులు చెపుతున్నారు. తాజ్‌మహల్ ప్రాంగణంలో కోతుల సంచారం పెరిగిందని, తరచూ కోతులు పర్యాటకులకు అంతరాయం కలిగిస్తున్నాయని అక్కడ పర్యాటకులు చెబుతున్నారు.
అయితే ఇక్కడకు ట్రంప్ కూడా రానున్నారు… దీంతో ఇక్కడ కోతుల బెడద లేకుండా చర్యలు తీసుకోనుంది సెక్యూరిటి.. ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానంపై ఈ నెల 24వతేదీన తాజ్‌మహల్‌ను సందర్శించనున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాధారణ సందర్శకులు లోపలకు రాకుండా మూసి వేయాలని అధికారులు నిర్ణయించారు.