గుడ్ న్యూస్ .. ట్రంప్ తో పాటు మ‌రో సెల‌బ్రెటీ కూడా వ‌స్తున్నారు

గుడ్ న్యూస్ .. ట్రంప్ తో పాటు మ‌రో సెల‌బ్రెటీ కూడా వ‌స్తున్నారు

0
84

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల ప‌ర్యట‌న గురించి దేశం అంతా చ‌ర్చించుకుంటోంది.. భార‌త్ లో సంబ‌రాలుగా చేస్తున్నారు .. ఇక భార‌త్ అంతా వార్త‌లు ఇవే, వీరి భేటీ గురించి చర్చ జ‌రుగుతోంది.. ట్రంప్ తొలిసారి ఇండియా రావ‌డం కూడా ఇక్క‌డ ఓ ఆస‌క్తిక‌రంగా మారింది.

డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ దంపతులు కూడా భారత దేశ పర్యటనకు వస్తున్నట్లు అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఈ నెల 24, 25 తేదీల్లో డొనాల్డ్ ట్రంప్ దంపతులు మన దేశంలో పర్యటిస్తారని తెలుసు అయితే కుమార్తె అల్లుడు గురించి తెలియ‌లేదు.

కాని తాజాగా ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెద్ కుష్నర్ కూడా ఇండియా ప‌ర్య‌ట‌న‌లో పాల్గొనబోతున్నారు అని తెలిసింది.. తాజాగా ఈ విష‌యం వైట్ హౌస్ తెలియ‌చేసింది. డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ కూడా అధికారిక ప్రతినిథి బృందంలో భాగస్వామి.. అందుకే ఆమె కూడా రానున్నారు, ఇప్ప‌టికే దేశంలో చాలా వ‌ర‌కూ ట్రంప్ రాక కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మొతెరా క్రికెట్ స్టేడియంలో జరిగే నమస్తే ట్రంప్ కార్య‌క్ర‌మంలో ఆయన పాల్గొంటారు, త‌ర్వాత ఆగ్రాప‌ర్య‌ట‌న‌కు వెళ్లి తాజ్ మ‌హ‌ల్ సంద‌ర్శిస్తారు.