ట్రంప్ కుమార్తె దుస్తులు జూవెలరీ ధర తెలిస్తే మతిపోతుంది

ట్రంప్ కుమార్తె దుస్తులు జూవెలరీ ధర తెలిస్తే మతిపోతుంది

0
93

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు మన భారత దేశ పర్యటనకు వచ్చారు ఇక శ్వేత సౌథం మొత్తం భారత్ కు కదిలింది, ఆయన మన దేశానికి రావడంతో అనేక ఏర్పాట్లు చేశారు, అయితే ఫ్యాషన్ ప్రపంచం అంతా అమెరికా అధ్యక్షుడి భార్య వైపు చూస్తారు ..ఎందుకు అంటే అత్యంత ఖరీదైన వస్తువులు నగలు వారు ధరిస్తారు కాబట్టి, అయితే ఈసారి మెలానియా ట్రంప్ తెల్లటి సాదాసీదా దుస్తులు ధరించారు.

కాని ఫ్యాషన్ ఐకాన్ ట్రంప్ కుమార్తె ఇవాంకా మాత్రం ఎర్రటి పూలున్న లేత నీలిరంగు ‘ప్రోయెంజా స్కైలర్’ డ్రెస్లో మెరిసిపోయారు. మెడభాగంలో పుస్సీ క్యాట్ బౌ ఉన్న ఈ పొట్టి చేతుల డ్రెసె ఖరీదు అక్షరాలా రూ.లక్షా డెబ్బై వేలు. నిజంగా దీని ధర తెలిసి అందరూ అవాక్కయ్యారు, ఆమె హాలీవుడ్ హీరోయిన్ల కంటే అందంగత్తె అని అంటున్నారు.

నీలం (సఫైర్), వజ్రాలున్న చెవి రింగులను ఇవాంకా ధరించారు. దీంతో అందరి చూపూ ఆమెపైనే ఉంది . 2019 సెప్టెంబరులో అర్జెంటీనాకు వెళ్లినప్పుడు కూడా ఆమె ఈ దుస్తులే వేసుకున్నారు. ఇక సుమారు ఆమె జూవెలరీ 10 లక్షలు ఉంటాయి అని అంటున్నారు.